తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వారణాసిలో పేదల కడుపు నింపుతున్న​ 'రోటీ బ్యాంక్​'

పేదల ఆకలి తీర్చడానికి ముందుకొచ్చారు వారణాసిలోని కిశోర్. తన కోచింగ్​ సెంటర్​లోని విద్యార్థుల సహకారంతో రోటీ బ్యాంకు ఏర్పాటు చేశారు. ఆహార పదార్థాలను సేకరించి వీధుల్లోని పేదల కడుపు నింపి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు కిశోర్.

'రోటీ బ్యాంక్​'తో పేదల కడుపు నింపుతున్న కిశోర్​

By

Published : Mar 25, 2019, 7:33 AM IST

'రోటీ బ్యాంక్​'తో పేదల కడుపు నింపుతున్న కిశోర్​
బ్యాంకు అనగానే సహజంగా నగదు లావాదేవీలు మాత్రమే గుర్తొస్తాయి. ఉత్తరప్రదేశ్​ వారణాసిలోనూ ఓ బ్యాంకు ఉంది. కానీ అది 'రోటీ బ్యాంకు.' కిశోర్ అనే యువకుడు ఏర్పాటు చేసిన ఈ బ్యాంకు వీధుల్లోని పేదవారు, యాచకుల కడుపు నింపుతోంది.


వారణాసిలో కోచింగ్ సెంటర్​ నిర్వహించే కిశోర్​ 2017 జూన్ 29న రోటీ బ్యాంకును ప్రారంభించారు. కోచింగ్​ కోసం వచ్చే విద్యార్థులు, వారి స్నేహితుల సాయంతో బ్యాంకును ఏర్పాటు చేశారు.

"ఓ ఆదివారం ఇక్కడే ఓ వ్యక్తిని చూశాను. అటు ఇటు తిరిగుతూ రోడ్డుపై దొరికినవి తింటున్నాడు. అది నన్ను చాలా బాధించింది. కనీసం భోజనమైనా పెట్టలేమా? అని అనిపించింది. "
-కిశోర్, రోటీ బ్యాంకు నిర్వాహకుడు

ఈ అనుభవమే రోటీ బ్యాంకును స్థాపించేలా కిశోర్​ను ప్రేరేపించింది. ఈ బ్యాంకుతో యాచకులకు, పేదవారికి ఆహారం అందిస్తున్నారు కిశోర్​. తన ఆలోచనను ప్రచారం చేయడం కోసం సామాజిక మాధ్యమాల సహాయం తీసుకున్నారు. చూస్తుండగానే మూడువేల మంది సహాయం చేయడానికి ముందుకొచ్చారు.

స్థానికులతో సహా పోలీసులూ వీరికి మద్దతునిస్తూన్నారు. రోజూ ఠాణాలో మిగిలిన ఆహారాన్ని సేకరిస్తుంది కిశోర్ బృందం. వీటన్నింటినీ తీసుకెళ్లి రోడ్లపై ఆకలితో ఉన్నవారికి అందిస్తారు.

ఈ పని తనకు సంతృప్తితినిస్తుందని కిశోర్​ తెలిపారు. పలువురికి స్ఫూర్తినిస్తే అదే చాలంటున్నారు కిశోర్.

ABOUT THE AUTHOR

...view details