తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రోష్నీ కుంభకోణంలో మాజీ సీఎం సోదరి పేరు - జమ్ముకశ్మీర్ భూకబ్జా కేసు

రోష్నీ కుంభకోణంలో అధికారులు విడుదల చేసిన జాబితాలో ప్రముఖుల బండారం బయటపడింది. జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా సోదరి సహా ఓ కాంగ్రెస్ నేత పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.

farooq
ఫరూఖ్

By

Published : Nov 26, 2020, 6:59 AM IST

జమ్ముకశ్మీర్ హైకోర్టు ఆదేశాల మేరకు 180 పేర్లతో అధికారులు విడుదల చేసిన భూకబ్జాదారుల రెండో జాబితాలో మరికొందరు ప్రముఖుల బండారం బయటపడింది. ఈ జాబితాలో మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా సోదరి, ఓ కాంగ్రెస్ నేతతోపాటు ఇద్దరు ప్రముఖ హోటల్ వ్యాపారుల పేర్లు ఉన్నాయి.

రోష్నీ చట్టాన్ని అక్రమం, రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొన్న హైకోర్టు.. ఆ చట్టాన్ని రద్దు చేసింది. దాని కింద యథేచ్ఛగా సాగిన భూకబ్జాలపై సీబీఐ విచారణకు ఆదేశించింది. రెండో జాబితాలో కాంగ్రెస్ నేతలు కె. కె.ఆమ్లా, ముష్తాఖ్ అహ్మద్ ఛాయ పేర్లు ఉన్నాయి.

ఇదీ చూడండి: 'జైల్లో నుంచే ఎన్నికల్లో గెలుస్తా'

ABOUT THE AUTHOR

...view details