అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామ మందిరాన్ని దర్శించుకునేందుకు రోప్‌వేను నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. దివ్యాంగులు, వృద్ధుల కోసం ఈ నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం స్విట్జర్లాండ్‌కు చెందిన ఓ సంస్థతో మున్సిపల్ అధికారులు చర్చలు జరుపుతున్నారని చెప్పారు.
ఆలయ ప్రాంగణంలో ఒక పాయింట్ ఏర్పాటు చేసి భక్తులకు అనుకూలంగా ఉండే ప్రాంతంలో మరో పాయింట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అయోధ్య మున్సిపల్ కమిషనర్ విశాల్ సింగ్ తెలిపారు.
"ఔట్-స్టేషన్ కోసం ఆమోదయోగ్యమైన స్థలాన్ని త్వరలో ఎంపిక చేస్తాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామ భక్తులు ఇక్కడికి వస్తారు. రోప్‌వే నిర్మించిన తర్వాత దివ్యాంగులు, వృద్ధులకు ప్రయోజనం కలుగుతుంది."