తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రోజుకు రూ.17 ఇచ్చి రైతులను అవమానిస్తారా? : రాహుల్

2019-20 మధ్యంతర బడ్జెట్​పై ప్రముఖ రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తల ట్వీట్లు

rahul

By

Published : Feb 1, 2019, 6:59 PM IST

కేంద్ర ఆర్థిక శాఖ తాత్కాలిక మంత్రి పీయూష్​ గోయల్​ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్​పై పలువురు రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు స్పందించారు. ఐదేళ్లపాటు దేశాన్ని అసమర్థంగా పాలించి రైతుల బతుకుల్లో సంతోషం లేకుండా చేశారని కాంగ్రెస్​ అధ్యక్షులు రాహుల్​గాంధీ విమర్శించారు.

మీ అయిదేళ్ల అసమర్థ పాలనలో రైతుల జీవితాలను అస్తవ్యస్తం చేశారు. రోజుకు కేవలం రూ.17 ఇవ్వడం వారి శ్రమను అవమానించడమే.
- రాహుల్​గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షులు

మధ్యతరగతి, కార్మికుల, రైతుల అంచనాలను అందుకునే విధంగా ఈ బడ్జెట్ ఉంది. రూ. 75 వేల కోట్ల వ్యయంతో ప్రభుత్వం 'ప్రధాన మంత్రి కిసాన్​ సమ్మాన్​ నిధి' పథకాన్ని అమలు చేయనుంది. 12 కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందనున్నారు. ఈ పథకం ద్వారా ఒక్కో రైతుకు రూ.6 వేలు అందించనున్నాం.
-అమిత్ షా, భాజపా జాతీయాధ్యక్షులు

రైతుల, పేదల, వాణిజ్య అభివృద్ధికి తోడ్పడే విధంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ప్రవేశపెట్టిన బడ్జెట్​ఇది. మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తిని పెంచే విధంగా బడ్జెట్​ ఉందనటంలో ఏ మాత్రం సందేహం లేదు.
-అరుణ్​ జైట్లీ, కేంద్ర మంత్రి

విజన్​ 2030కి అనుగుణంగా, అందరితో కలిసి, అందరి అభివృద్ధి కోసం అన్న (సబ్​కా సాత్​​, సబ్​కా వికాస్)​ ప్రధాని మోదీ నినాదాన్ని పునరుద్ఘాటించే విధంగా పీయూష్​ గోయల్​ బడ్జెట్​ ఉంది. నవభారతాన్ని నిర్మించాలనుకుంటున్న భాజపా ప్రభుత్వ విలువలకు అనుగుణంగా ఉంది.
-స్మృతి ఇరానీ, కేంద్ర జౌళిశాఖ మంత్రి

దేశంలోని వనరులపై పేదవారికే తొలి అధికారం ఉందన్న కాంగ్రెస్​ సిద్ధాంతాన్ని అనుకరించినందుకు తాత్కాలిక ఆర్థిక మంత్రికి నా కృతజ్ఞతలు.
- పి. చిదంబరం, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి

ఎన్నికలకు ముందు ఇలాంటి బడ్జెట్​ ప్రవేశపెడతారని ఊహించాను. ఆర్థిక వ్యవస్థకు నష్టం కలగకుండా మధ్యతరగతి ప్రజలు, రైతులకు ఉపశమనం కల్పించినందుకు నా కృతజ్ఞతలు.
-ఆనంద్​ మహీంద్రా, మహీంద్రా గ్రూప్​ చైర్మన్

ABOUT THE AUTHOR

...view details