ఇండియన్ ఇన్ట్నిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధన సంస్థ 'స్పైన్ సర్జరీ రోబో' ను (వెన్నెముకకు శస్త్ర చికిత్స చేసే మర మనిషి) అభివృద్ధి చేసింది. ఈ రోబో ద్వారా రోగికి బాధ కలగకుండా, సులభంగా శస్త్ర చికిత్స చేసేందుకు దీనిని తయారుచేశారు ఐఐటీ మద్రాసుకు చెందిన పరిశోధకులు. ఇది ఇండియాలోనే మెుట్టమెుదటి వెన్నెముక రోబోటిక్ వ్యవస్థ.
వెన్నెముకకు శస్త్ర చికిత్స చేయాటానికి సర్జన్లకు ఈ రోబోటిక్ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుంది. కానీ దీనికి సంబంధించిన పరికరాలు చాలా ఖర్చుతో కూడుకున్నవి. ప్రపంచంలో ఈ వ్యవస్థ అందుబాటులో ఉన్న చోట శస్త్ర చికిత్స చేయటానికి 1 మిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది. వెన్నెముక చికిత్సకు అవసరమైన చోట రంధ్రం చేయటానికి వీలు పడటం లేదు. వెన్నెముకకు రంధ్రం చేసే విధంగా ఈ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. విజువలైజేషన్‌కు, రియల్ టైం ట్రాకింగ్‌కు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని పరిశోధన బృందం చెబుతోంది.
'సాధారణ శస్త్ర చికిత్స కంటే శస్త్ర చికిత్స సమయం, చికిత్స జరిగిన తర్వాత వచ్చే అంటువ్యాధులు తగ్గించేందుకు ఈ రోబోటిక్ వ్యవస్థ ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చు. దీని ద్వారా రోగి త్వరగా కోలుకునే అవకాశం ఉంది.'