తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా ఆసుపత్రిలో స్వదేశీ రోబోల సేవలు - robot nurse in vadodhara

కరోనాను తరిమికొట్టేందుకు స్వదేశీ రోబోలు రంగంలోకి దిగాయి. కరోనా రోగుల నుంచి వైరస్​ వ్యాప్తి చెందకుండా గుజరాత్​లోని ఓ ఆసుపత్రిలో రెండు రోబోలు సాయపడుతున్నాయి. నర్సుల బాధ్యతలు భుజానవేసుకుని బాధితులకు మందులు, ఆహారం అందిస్తున్నాయి. ఎప్పటికప్పుడు పేషెంట్లకు స్క్రీనింగ్​ నిర్వహిస్తున్నాయి.

Robots deployed to serve COVID-19 patients in Vadodara based hospital
ఆసుపత్రిలో స్వదేశీ రోబోల సేవలు అమోఘం!

By

Published : Jul 19, 2020, 5:44 AM IST

కరోనా ఆసుపత్రిలో స్వదేశీ రోబోల సేవలు

గుజరాత్​ వడోదరాలోని సర్​ సయాజీరావు ఆసుపత్రిలో కరోనా బాధితులకు ఆహారం, మందులు అందిస్తున్నాయి రెండు రోబోలు. సమయానుకూలంగా రోగులకు స్క్రీనింగ్​ నిర్వహిస్తూ.. వైద్య సిబ్బందికి కరోనా సోకే ప్రమాదాన్ని తగ్గిస్తున్నాయి.

చకాచకా కదలాడుతూ.. రోగులకు సేవలందిస్తోన్న ఈ రోబోలు భారతదేశంలో తయారైనవే. క్లబ్​ ఫస్ట్​ టెక్నాలజీ సంస్థ వీటిని తయారు చేసింది. ఒక్కసారి చార్జ్​ చేస్తే నాలుగు గంటలు ఆగకుండా పని చేయగల ఈ రోబోలు.. కరోనా సోకిన వారి నుంచి వైరస్​ మరొకరికి వ్యాపించకుండా కీలక పాత్ర పోషిస్తున్నాయి. త్వరలో ఓ రోబో ఆసుపత్రి గేటు వద్ద నిల్చుని.. లోనికి ప్రవేశించేవారిని గేటు వద్దే స్క్రీనింగ్​ చేయనుందన్నారు ఆసుపత్రి నిర్వాహకులు.

"ఇవి భారతదేశంలో తయారైన రోబోలు. వీటిని ఆపరేట్​ చేయడం ఎంతో సులభం. ఈ రోబోలు అచ్చం మనిషిలాగే పని చేస్తాయి. కరోనా రోగులకు సేవ చేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. "

-భువనేశ్​ మిశ్రా, క్లబ్​ ఫస్ట్​ టెక్నాలజీ ఎండీ

ఇదీ చదవండి:కరోనా నమూనాలు సేకరిస్తున్న రోబో!

ABOUT THE AUTHOR

...view details