మహారాష్ట్ర- చంద్రపూర్‌లోని సివిల్ అసుపత్రిలో రోబో ద్వారా సేవలందిస్తున్నారు వైద్య సిబ్బంది. ప్రస్తుతం ఇప్పుడున్న సేవలకే పరిమితం కాకుండా.. మరికొన్ని మార్పులతో త్వరలోనే కొవిడ్ పరీక్షల నమూనాల సేకరణలోనూ ఈ రోబోను ఉపయోగించుకోవచ్చని ఓ అధికారి తెలిపారు.
రోగులకు మందులు, ఆహార పదార్థాలను అందించే ఈ 'మెడీ రోవర్ రోబో'ను జిల్లా కలెక్టర్ డాక్టర్ కునాల్ ఖేమ్నర్.. ఆసుపత్రికి అందించారు. ఈ రోబోను టాటా సాంకేతిక పరిజ్ఞానం సాయంతో.. చంద్రపూర్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల వారు రూపొందించారని ఖేమ్నర్ తెలిపారు.