తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జాతీయ జెండా మార్చిన ​వాద్రాపై విమర్శలు

ప్రియాంకగాంధీ భర్త రాబర్ట్​ వాద్రా పెట్టిన ఓ ఫేస్​బుక్​ పోస్టు వివాదాస్పదమైంది. పొరపాటున భారత పతాకానికి బదులు పరాగ్వే జెండా గుర్తును ఎమోజీగా ఉంచిన ఆయన తరువాత తప్పు దిద్దుకున్నారు. అయినా దీనిపై సామాజికమాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి.

జెండా మార్చిన రాబర్ట్​వాద్రా

By

Published : May 13, 2019, 7:16 AM IST

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా పెట్టిన ఓ ఫేస్​బుక్​ పోస్టు​ సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్​ అయింది. ఆదివారం దిల్లీలో ఓటువేసిన వాద్రా, సిరాపూసిన తన వేలును చూపుతూ ఓ ఎమోజీని పెట్టారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓ సందేశాన్నీ ఉంచారు. అయితే భారత పతాకానికి బదులు పరాగ్వే జెండా ఎమోజీని పోస్టు చేశారు. దీనిపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తీవ్ర విమర్శలు చేశారు.

జెండా మార్చిన రాబర్ట్​వాద్రా

తరువాత తప్పు గ్రహించిన వాద్రా తన ఫేస్​బుక్​ పోస్టులో పరాగ్వే జెండా స్థానంలో త్రివర్ణ పతాకాన్ని ఉంచారు.

"భారత్​ నా గుండెల్లో కొలువై ఉంది. త్రివర్ణ పతాకానికి వందనం. పరాగ్వే జెండాను ఉంచడం నా తప్పిదం. పొరపాటున దాన్ని పోస్టు చేసినట్లు అందరికీ తెలుసు. చర్చించాల్సిన అనేక తీవ్రమైన అంశాలను వదిలిపెట్టి, నా తప్పిదాన్ని మీరు చిలువలు పలువలు చేశారు. ఇది నన్ను ఆవేదనకు గురిచేస్తోంది. అయినా ఇబ్బందేమీ లేదు. అందరికీ నా శుభాకాంక్షలు."-రాబర్ట్ వాద్రా, ఫేస్​బుక్​ పోస్టు

అయినా దీనిపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఆదివారం ఆరో దశ ఎన్నికల్లో తన భార్య ప్రియాంక గాంధీతో కలిసి దిల్లీలోని ఓ పోలింగ్​ కేంద్రంలో రాబర్ట్​వాద్రా ఓటువేశారు. సోనియా, రాహుల్​ గాంధీ వేర్వేరుగా ఓటుహక్కు వినియోగించుకున్నారు.

ఇదీ చూడండి: ఘనంగా 'త్రిస్సూర్​ పూరం'.. ఆలయాన్ని తెరిచిన గజం

ABOUT THE AUTHOR

...view details