తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈడీ ఎదుట హాజరైన రాబర్ట్ వాద్రా - priyanka

రాబర్ట్ వాద్రా దిల్లీలోని ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. లండన్ అక్రమాస్తుల కేసులో విచారణ జరుగుతోంది.

రాబర్ట్ వాద్రా

By

Published : May 30, 2019, 11:13 AM IST

Updated : May 30, 2019, 12:27 PM IST

ఈడీ ముందుకు వాద్రా

అక్రమాస్తుల కేసులో విచారణకు దిల్లీలోని ఈడీ కార్యాలయంలో మరోసారి వ్యాపారవేత్త రాబర్ట్​ వాద్రా హాజరయ్యారు. అక్రమ నగదు చలామణి ద్వారా లండన్​లో 1.9 మిలియన్​ పౌండ్ల ఆస్తులు కూడబెట్టారని రాబర్ట్ వాద్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని ఇటీవల ఈడీ సమన్లు జారీ చేసింది.

రాబర్ట్​ వాద్రాపై అక్రమ నగదు బదిలీకి పాల్పడ్డారన్నది ప్రధాన అభియోగం. ఈ కేసులో ఈడీ ఇప్పటికే అనేక చోట్ల సోదాలు జరిపి కీలక ఆధారాలు సేకరించింది. వాద్రాకు మంజూరైన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని ఈడీ ఇప్పటికే దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈడీ పిటిషన్‌పై జులై 17లోగా స్పందించాలని దిల్లీ హైకోర్టు వాద్రాను ఆదేశించింది.

ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు వాద్రాను విచారించింది ఈడీ. అయితే ఈ ఆరోపణలను వాద్రా మొదటి నుంచి ఖండిస్తూనే వస్తున్నారు. రాజకీయ దురుద్దేశంతోనే కొందరు తనపై ఇలా కుట్రపన్నారని వాద్రా ఆరోపించారు.

ఇదీ చూడండి: హవాలా కేసులో వాద్రాకు ముందస్తు బెయిల్​

Last Updated : May 30, 2019, 12:27 PM IST

ABOUT THE AUTHOR

...view details