నవీ ముంబయిలో పట్టపగలే ఇద్దరు దొంగలు బ్యాంకును లూఠీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొత్తం రూ. 4.5 లక్షలతో వారు పరారయ్యారు.
కోపర్ ఖైరానే ప్రాంతంలో గురువారం ఇద్దరు దొంగలు సరస్వతీ బ్యాంక్‌లోకి చొరబడ్డారు. బ్యాంక్ సిబ్బంది మెడపై కత్తి పెట్టి.. లాకర్ నుంచి డబ్బులు దోచుకున్నారు. ఘటనా సమయంలో బ్యాంకులో మొత్తం ఏడుగురు ఉద్యోగులు ఉన్నారు.