తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్లాస్టిక్​తో రోడ్ల నిర్మాణం... పర్యావరణ హితమే లక్ష్యం - plastic ban campaign

పర్యావరణానికి పెనుముప్పుగా మారిన ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టాలని పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఉత్తర్​ప్రదేశ్​ ఘాజియాబాద్ అధికార యంత్రాంగం. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్​తో ఆ జిల్లాలో ఇప్పటికే మూడు రోడ్లు నిర్మించారు.

plastic roads
ప్లాస్టిక్​తో రోడ్ల నిర్మాణం... పర్యావరణ హితమే లక్ష్యం

By

Published : Dec 24, 2019, 7:33 AM IST

ప్లాస్టిక్​తో రోడ్ల నిర్మాణం... పర్యావరణ హితమే లక్ష్యం

మానవాళి మనుగడకు ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్​ భూతంపై ప్రజల్లో అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఉత్తర్​ప్రదేశ్ ఘాజియాబాద్ జిల్లా యంత్రాంగం. పురపాలకసంఘం సంయుక్త కార్యచరణతో సింగిల్​ యూజ్​ ప్లాస్టిక్​ను నిషేధించాలని ర్యాలీలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది.

ఎన్​సీఆర్​ దిల్లీకి హృదయంగా భావించే ఘాజియాబాద్​లో సింగిల్ యూజ్​ ప్లాస్టిక్ వ్యర్థాలతో కేవలం నెలరోజుల్లో మూడు రోడ్లను నిర్మించారు పురపాలక అధికారులు.

" ప్లాస్టిక్ వ్యర్థాలతో విదేశాల్లో రోడ్లను నిర్మించడాన్ని ఆదర్శంగా తీసుకున్నాం. ఉత్తర్​ప్రదేశ్​లోనూ అలా చేయాలని నిర్ణయించాం. ఘాజియాబాద్​ను ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలనుకున్నాం. అందుకే మొదట ప్లాస్టిక్​ వ్యర్థాలతో రోడ్లు నిర్మించి లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నాం. ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి ప్రభావవంతంగా ఉపయోగించాలనుకున్నాం. ఆలోచన కార్యరూపం దాల్చింది. మూడు రోడ్లను నిర్మించాం. మరిన్ని నిర్మిస్తాం. ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్ల నిర్మాణం గురించి తెలుసుకునేందుకు ఇతర రాష్ట్రాలూ ఆసక్తిగా ఉన్నాయి. దీంతో మేం ఓ లక్ష్యాన్ని సాధించినట్లయింది. "

-ఆశా శర్మ, ఘాజియబాద్ మేయర్​.

జిల్లా యంత్రాంగం నిర్వహించే అవగాహన కార్యక్రమాలు ప్లాస్టిక్ వ్యాపారులనూ ఆకట్టుకున్నాయి. తమ వద్ద ఉన్న టన్నుల ప్లాస్టిక్​ను స్వచ్ఛందంగా అప్పగిస్తున్నారు. టన్ను ప్లాస్టిక్​ను సేకరించి జిల్లా అధికారులకు ఇచ్చారు నలుగురు ఔత్సాహికులు. సింగిల్ యూజ్​ ప్లాస్టిక్​ను పూర్తిగా నిషేధించాలని పిలుపునిచ్చారు.

" మాకున్న సిబ్బంది, అందుబాటులో ఉన్న వనరుల సాయంతో జిల్లా వ్యాప్తంగా పాలిథీన్​ను సేకరించాం. అదే సమయంలో ప్లాస్టిక్​ దుష్ప్రభావంపై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చాం. ఈ కారణంగా ఇప్పటి వరకు 7 టన్నుల సింగిల్​ యూజ్​ ప్లాస్టిక్​ను సేకరించాం. ఏడుగురు వ్యాపారులు చెత్తను సేకిరించి సంబంధిత అధికారులకు అప్పగిస్తామని చెప్పారు. మా లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇది సానుకూల సంకేతం. "

-అజయ్ శంకర్​ పాండే, ఘాజియబాద్ డిప్యూటీ మేయర్.

శుభకార్యాలు, పండుగల సమయంలో స్థానికుల కోసం స్టీల్ పాత్రల కేంద్రాన్ని ఏర్పాటు చేసింది ఘాజియాబాద్​ మున్సిపల్ కార్పొరేషన్. ప్లాస్టిక్​ వాడకానికి ప్రత్యామ్నాయంగా ఈ ఆలోచన చేసింది.

ABOUT THE AUTHOR

...view details