దేశంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటున్నాయి. వీటిల్లో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్ల వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిస్థితులపై ఒడిశా విద్యార్థులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
రోడ్డుపై మృతదేహాలు...

ఒడిశా నబరంగ్పుర్ జిల్లాలో రోడ్లు అత్యంత దారుణ పరిస్థితుల్లో ఉన్నాయి. ముఖ్యంగా జిల్లాలోని ఉమర్కోట్ నుంచి రాయ్‌గఢ్.. అక్కడి నుంచి ఒడిశా సరిహద్దు ప్రాంతానికి వెళ్లే రోడ్లు మరీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. దీని వల్ల అనేక మరణాలు సంభవిస్తున్నాయి. వీటికి నిరసనగా ఆదర్శ విద్యాలయ్ పాఠశాల విద్యార్థులు.. రోడ్డుపై ఓ నాటికను ప్రదర్శించారు.
ఈ డ్రామాలో.. రక్తపు మడుగులో కొంతమంది విద్యార్థులు రోడ్డుపై పడి ఉన్నారు. పెద్దపెద్ద గాయాలతో వీరు అచేతన స్థితిలో ఉండగా.. మరికొందరు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. రోడ్డు ప్రమాదాలను అశ్రద్ధ చేయవద్దని.. రహదారులకు మరమ్మత్తు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:-'అల్లుడు గారూ... గాడిదపై ఎక్కండి మర్యాదలు చేస్తాం!'