తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విహార యాత్రకు వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ఆరుగురు మృతి - విహార యాత్రకు వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ఆరుగురు మృతి

హరియాణా కైతల్​లో శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. స్నేహితులంతా కలిసి విహార యాత్రకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

road-accident-in-kaithal-dot-dot-dot-6-people-died
విహార యాత్రకు వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ఆరుగురు మృతి

By

Published : Feb 2, 2020, 12:21 PM IST

Updated : Feb 28, 2020, 9:12 PM IST

విహార యాత్రకు వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ఆరుగురు మృతి

హరియాణా కైతల్​లో విషాద ఘటన చోటు చేసుకుంది. స్నేహితులంతా కలిసి విహార యాత్రకు వెళ్లి వస్తున్న క్రమంలో కారు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో కారులోని ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

యువకుల మృతితో వారి కుటుంబాల్లో విషాదం అలుముకుంది. మరణించిన వారిలో ఒకరికి మూడు నెలల క్రితమే వివాహం జరినట్లు వెల్లడించారు కుటుంబ సభ్యులు.

ఆరుగురు స్నేహితులు విహారయాత్రకు వెళ్లి వస్తుండగా.. పుండరి ప్రాంతంలో కారు అదుపు తప్పి 40 అడుగుల లోతైన కాలువలో పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఐదు మృతదేహాలు కారులోనే ఉన్నట్లు గుర్తించామని.. మరోకటి.. 50 అడుగుల దూరంలో పడి పోయినట్లు పోలీసులు తెలిపారు. పోగ మంచులో అతివేగంగా రావటం వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. మృతదేహాలను శవ పరీక్ష తరలించినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: 'ఆశల పద్దు' అందరిని ఆనంద పరిచేనా?

Last Updated : Feb 28, 2020, 9:12 PM IST

ABOUT THE AUTHOR

...view details