తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జూన్​ 30 వరకు బుక్​ చేసుకున్న రైలు టికెట్లు రద్దు

దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా పెరగటం, లాక్​డౌన్​ పొడిగించే అవకాశం ఉన్న నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్​లో ప్రయాణాల కోసం గతంలో బుకింగ్స్​ చేసుకున్న అన్ని రకాల రైళ్ల టికెట్లను రద్దు చేసింది. టికెట్​ డబ్బును పూర్తిగా తిరిగి చెల్లిస్తామని వెల్లడించింది. అయితే.. శ్రామిక్​, ప్రత్యేక రైళ్ల సేవలు కొనసాగుతాయని తెలిపింది.

cancel tickets
జూన్​ 30 వరకు బుక్​ చేసుకున్న రైలు టికెట్ల రద్దు

By

Published : May 14, 2020, 11:51 AM IST

Updated : May 14, 2020, 5:30 PM IST

జూన్​ 30 వరకు షెడ్యూల్​ చేసిన సాధారణ రైళ్ల కోసం గతంలో చేసుకున్న టికెట్​ బుకింగ్​లన్నింటినీ రద్దు చేయాలని నిర్ణయించింది రైల్వే శాఖ. రద్దయిన టికెట్లకు పూర్థి స్థాయిలో డబ్బులు రీఫండ్​ చేయనున్నట్లు తెలిపింది. అయితే.. మే 1 నుంచి ప్రారంభమైన శ్రామిక్​ ప్రత్యేక రైళ్లు, మే 12 నుంచి మొదలైన ప్రత్యేక ట్రైన్ల సేవలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.

కరోనా కట్టడికి విధించిన లాక్​డౌన్​తో మార్చి 25 నుంచి సాధారణ మెయిల్​, ఎక్స్​ప్రెస్​, ప్యాసింజర్​, సబ్​అర్బన్ సర్వీసులను నిలిపివేసింది రైల్వే శాఖ. అయితే.. జూన్​లో రైలు ప్రయాణాల కోసం లాక్​డౌన్​ సమయంలో టికెట్​ బుకింగ్స్​కు అనుమతించింది. లాక్​డౌన్​ మరిన్ని రోజులు పొడిగించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

లాక్​డౌన్​ 3.0 ముగిసే మే 17 వరకు అన్ని రకాల రైళ్ల టికెట్​ బుకింగ్స్​ను ఇప్పటికే నిలిపివేసింది రైల్వేశాఖ.

Last Updated : May 14, 2020, 5:30 PM IST

ABOUT THE AUTHOR

...view details