గత మూడేళ్ల కాలంలో రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణం చేసే వారి నుంచి 1377కోట్ల రూపాయలను జరిమానాల రూపంలో వసూలు చేసింది రైల్వే శాఖ. 2016తో పోలిస్తే ఈ మొత్తం దాదాపు 31 శాతం పెరిగినట్లు అధికారులు తెలిపారు. మధ్య ప్రదేశ్కు చెందిన ఓ సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తును దాఖలు చేశారు. అందుకు రైల్వే అధికారులు బదులిస్తూ... టికెట్ లేకుండా ప్రయాణం చేసేవారిని నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యల కారణంగా ఇది సాధ్యపడినట్లు తెలిపారు.
గత మూడేళ్లలో వసూలు ఇలా