తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఏప్రిల్​ 15 నుంచి రైలు సేవలు పునరుద్ధరణ! - corona latest news

లాక్​డౌన్​ పూర్తయిన తర్వాతి రోజు (ఏప్రిల్​ 15) నుంచి రైల్వే సేవలు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఈ మేరకు పునరుద్ధరణ ప్రణాళికను అన్ని జోన్లకు రైల్వే శాఖ పంపించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఉద్యోగులు విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు వచ్చినట్లు వెల్లడించారు. దీనిపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

railways
ఏప్రిల్​ 15 నుంచి రైల్వే సేవల పునరుద్ధరణ!

By

Published : Apr 4, 2020, 1:03 PM IST

కరోనా లాక్​డౌన్​ నేపథ్యంలో నిలిచిపోయిన రైల్వే సేవలను ఈనెల 15 నుంచి పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టింది రైల్వే శాఖ. ఈ మేరకు భద్రత, గార్డ్స్​, టీటీఈ, ఇతర సిబ్బంది ఏప్రిల్​ 15వ తేదీ నుంచి విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు అందినట్లు రైల్వేశాఖ వర్గాలు తెలిపాయి. అయితే.. దీనిపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఈ అంశంపై ఏర్పడిన మంత్రుల బృందం ఆమోదం లభించిన తర్వాతే సేవలు అందుబాటులోకి రానున్నాయి.

మరోవైపు.. దేశంలోని అన్ని రైల్వే జోన్లకు రైళ్ల షెడ్యూల్​, వెళ్లాల్సిన దూరం వంటి వివరాలతో పునరుద్ధరణ ప్రణాళికను విడుదల చేసింది రైల్వే శాఖ. 17 జోన్లు సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఏప్రిల్​ 14 వరకే రైళ్ల రద్దుకు ఆదేశాలు ఉన్నాయని.. ఇప్పటి వరకు ఎలాంటి కొత్త ఆదేశాలు అందలేదని కొందరు ఉన్నతాధికారులు తెలిపారు. 15 నుంచి సేవలు పునరుద్ధరించేందుకు మరోమారు ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

అందుబాటులోకి 80 శాతం రైళ్లు

ఏప్రిల్​ 15 నుంచి షెడ్యూల్​ ప్రకారం సుమారు 80 శాతం రైళ్లు నడిచే అవకాశం ఉంది. ఇందులో రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లు కూడా ఉన్నాయి. వాటితో పాటు లోకల్​ ట్రైన్లనూ నడిపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.

స్క్రీనింగ్​..

కరోనా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో ప్రయాణికులకు థర్మల్​ స్క్రీనింగ్​ నిర్వహించనున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి అన్ని రకాల చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించాయి.

ఇదీ చూడండి: ఈ గొడుగు ఉంటే కరోనా మీ దరిచేరదు!

ABOUT THE AUTHOR

...view details