బిహార్‌లో రాజకీయం వేడెక్కుతోంది. ప్రతిపక్ష రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) పార్టీలో చేరారు. జులై 6న జరగనున్న ఎమ్మెల్సీల ఎన్నికల నేపథ్యంలో ఈ ఫిరాయింపులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీంతో శాసనమండలిలో జేడీయూ బలం 21కి చేరింది. 75 స్థానాలున్న బిహార్ శాసనమండలిలో 29 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. తొమ్మిది స్థానాలకు జులై 6న ఎన్నికలు జరగనున్నాయి.
బిహార్ ఎన్నికల ముందు ఆర్జేడీకి షాక్ - Bihar legislative council
బిహార్‌లో రాష్ట్రీయ జనతాదళ్ పార్టీకి షాక్ తగిలింది. ఐదుగురు ఎమ్మెల్యీలు అధికార పార్టీ జనతాదళ్ యునైటెడ్లో చేరారు. జులై 6న జరగనున్న ఎమ్మెల్యీల ఎన్నికల నేపథ్యంలో ఈ ఫిరాయింపులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆర్జేడీకి ఇది అతి పెద్ద నష్టమనే చెప్పుకోవాలి. కూటిమిలోని చిన్న పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల విషయం త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆ పార్టీకి అల్టిమేటం విధించాయి. అలానే రాబోయే రోజుల్లో ఆర్జేడీ నుంచి మరిన్ని ఫిరాయింపులు ఉంటాయని అధికార పార్టీ నాయకులు అంటున్నారు. అక్టోబరు-నవంబరులో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం హోం మంత్రి అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రాంభించారు. దీంతో మరోసారి అధికారం తమదేనని జేడీయూ, భాజపా కూటమి నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: 'ఆ కుటుంబం వల్లే వేలాది కిలోమీటర్ల భూభాగం కోల్పోయాం'