తాము అధికారంలోకి వస్తే బిహార్ ప్రజలకు 10లక్షల ఉద్యోగాలిస్తామని ఆర్జేడీ నేత, మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ హామీ ఇచ్చారు. రైతుల రుణాలు మాఫీ చేస్తామన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం.. పట్నాలో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆర్జేడీ హామీలు...
- రాష్ట్రంలో ఉన్న 17 సమస్యలకు ప్రాధాన్యం
- 10లక్షల ఉద్యోగాలపై తొలి కేబినెట్ సమావేశంలోనే నిర్ణయం
- పనికి తగ్గ వేతనం
- కాంట్రాక్ట్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి చేర్చుకోవడం
- ప్రైవేటీకరణకు స్వస్తి
- అన్ని నీటిపారుదల పంపులను సౌర పంపులుగా మార్చడం
- బిహార్లో క్రీడా విశ్వవిద్యాలయం
- ప్రతి డివిజన్లోనూ పెద్ద స్టేడియం
- ప్రభుత్వ ఉద్యోగులకు ముందస్తు పింఛను వ్యవస్థ
- ప్రత్యేక ఆర్థిక జోన్ల ఏర్పాటు
- విద్యుత్ రేట్లలో కోత
- రైతు రుణాల మాఫీ