తెలంగాణ

telangana

పౌర చట్టానికి వ్యతిరేకంగా బిహార్​ బంద్​... ఆందోళనలు

By

Published : Dec 21, 2019, 10:46 AM IST

Updated : Dec 21, 2019, 7:00 PM IST

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నేడు బిహార్ రాష్ట్ర బంద్​కు పిలుపునిచ్చింది ఆర్జేడీ. పలు జిల్లాల్లో రహదార్లను నిర్బంధించారు ఆ పార్టీ కార్యకర్తలు. రోడ్లపై అర్ధనగ్న ప్రదర్శనతో నిరసనలు చేపట్టారు.

RJD bundh in bihar against CAA
పౌర చట్టానికి వ్యతిరేకంగా బిహార్​ బంద్

పౌర చట్టానికి వ్యతిరేకంగా బిహార్​ బంద్​... ఆందోళనలు

పౌరసత్వ చట్ట వ్యతిరేక నిరసనలు బిహార్​లో ఉద్ధృతమయ్యాయి. నేడు రాష్ట్రబంద్​కు పిలుపునిచ్చింది రాష్ట్రీయ జనతా దళ్(ఆర్​జేడీ) పార్టీ. బంద్​ను విజయవంతం చేసేందుకు పార్టీ కార్యకర్తలు ఉదయం నుంచే రోడ్లపైకి వచ్చారు. దర్భంగాలోని రహదారిపై టైర్లకు నిప్పంటించి అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. బిహార్​ సీఎం నితీశ్​ కుమార్, కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేశారు.

వైశాలిలో గేదెలతో రహదారిని దిగ్బంధించారు ఆర్జేడీ మద్దతుదారులు. దర్భంగాలోని రైల్వే స్టేషన్​లో రైళ్ల రాకపోకలను నిలువరించారు. పౌరచట్టానికి వ్యతిరేకంగా ఆర్జేడీ పిలుపునిచ్చిన బంద్​కు మద్దతు తెలపాలని ప్రజలను కోరారు ఆ పార్టీనేత, బిహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్​.

పట్నాలో వీఐపీ పార్టీ కార్యకర్తలు.. బ్యారికేడ్లను దాటుకొని వచ్చి ఆందోళనలు చేస్తున్నారు.

ఇదీ చూడండి: శరణార్థులను ఆదుకోవడానికే 'పౌర' చట్టం: కిషన్​రెడ్డి

Last Updated : Dec 21, 2019, 7:00 PM IST

ABOUT THE AUTHOR

...view details