ఉత్తర కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలకు 35 వేల మందికిపైగా ప్రజలు వరద ముంపు బారిన పడ్డారని ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు. కలబుర్గి, విజయపుర, యాదగిరి, రాయచూర్ జిల్లాల్లోని అనేక గ్రామాలు ఈ వరద ప్రభావానికి గురయ్యాయి.
వరద ఉద్ధృతి కొనసాగుతున్న కారణంగా భీమా నది ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తోంది. భారీ వర్షాల కారణంగా కృష్ణా నది ఉపనదులు జిల్లాల్లో భారీ నష్టాన్ని కలుగజేశాయి.
97 గ్రామాలు..
వరదల ఉద్ధృతికి నాలుగు జిల్లాల్లోని 97 గ్రామాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని కర్ణాటక విపత్తు నిర్వహిణ బృందం తెలిపింది.