తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కుటుంబసభ్యుల ఓట్లన్నీ ఒకే వ్యక్తి వేశాడు'

అసోంలోని కరీమ్​గంజ్​ లోక్​సభ నియోజకవర్గంలో రిగ్గింగ్ జరిగింది. ఒక్కో వ్యక్తి 14-15 ఓట్లు వేశాడు. ఈ విషయాన్ని ఎన్నికల అధికారి అంగీకరించారు.

By

Published : Apr 18, 2019, 6:12 PM IST

'కుటుంబసభ్యుల ఓట్లన్నీ ఒకే వ్యక్తి వేశాడు'

'కుటుంబసభ్యుల ఓట్లన్నీ ఒకే వ్యక్తి వేశాడు'

అసోంలోని కరీమ్​గంజ్​ లోక్​సభ నియోజకవర్గంలో జోరుగా రిగ్గింగ్​ జరిగింది. ఓ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన 467వ బూత్‌లో ఒక్కో వ్యక్తి దాదాపు 15 ఓట్లు వేస్తూ కనిపించారు. ఈ విషయంపై​ అక్కడి ఎన్నికల అధికారిని ప్రశ్నించగా... తమకు రిగ్గింగ్​తో సంబంధంలేదన్నారు. ఇలాంటి వారిని అడ్డుకునే బాధ్యత భద్రతా సిబ్బందిదేనని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు.

ప్ర: ఏం జరుగుతోంది ఇక్కడ?
జ: కుటుంబ సభ్యులందరి ఓట్లు ఒకే వ్యక్తి వేస్తున్నారు.

ప్ర: ఒక్క వ్యక్తి ఎన్ని ఓట్లు వేశారు?
జ: 15 మందిలో 14 ఓట్లు ఒక్క వ్యక్తే వేశారు.

ప్ర: ఈ సంఘటన ఎలా జరిగింది?
జ: మా పని ఇక్కడ పనిని చూసుకోవడం. నేను నా పని చేస్తున్నాను. ఇలాంటి పనులన్నీ భద్రతా సిబ్బంది చూసుకోవాలి.

ఇదీ చూడండి: చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతం

ABOUT THE AUTHOR

...view details