ప్రముఖ ప్రకృతి శాస్త్రవేత్త, బ్రాడ్‌కాస్టర్ సర్ డేవిడ్ అటెన్‌బరో.. ఈ ఏడాది ఇందిరాగాంధీ శాంతి బహుమతికి ఎంపికయ్యారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోని అంతర్జాతీయ జ్యూరీ ఈ అవార్డు విజేతను ఎంపిక చేసినట్లు దిల్లీలోని ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. భూగోళంలోని ప్రకృతి రహస్యాలను విశదీకరించిన గొప్ప శాస్త్రవేత్త సర్ అటెన్‌బరో అని ట్రస్టు ప్రకటించింది. జీవవైవిధ్యాన్ని కాపాడుకునేందుకు అటెన్‌బరో ఎంతో కృష్టి చేశారని కొనియాడింది.
డేవిడ్ అటెన్‌బరోకు ఇందిరాగాంధీ శాంతి పురస్కారం - richard attenbaro won indira gandhi peace prize
మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ శాంతి బహుమతికి ఎంపికయ్యారు ప్రముఖ ప్రకృతి శాస్త్రవేత్త, బ్రాడ్ కాస్టర్ సర్ డేవిడ్ అటెన్‌బరో. ప్రకృతి రహస్యాలపై చేసిన కృషికి అటెన్‌బరోకు ఈ అవార్డు అందిస్తున్నట్లు దిల్లీలోని ఇందిరా గాంధీ స్మారక ట్రస్టు ప్రకటన విడుదల చేసింది.
రిచర్డ్ అటెన్‌బరోకు ఇందిరాగాంధీ శాంతిపురస్కారం!
ప్రకృతి సంపదపై ఎన్నో పుస్తకాలు రాశారు అటెన్‌బరో. ఎక్కువ శాతం బీబీసీ ఛానెల్ కోసం పనిచేసిన అటెన్‌బరో ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు గెలుచుకున్నారు. ఆయన రూపొందించిన డాక్యుమెంటరీలకు కూడా విశేష గుర్తింపు ఉంది. అంతరిస్తున్న, సజీవంగా ఉన్న అనేక జీవాలకు అటెన్‌బరో పేరు పెట్టారు.
ఇదీ చూడండి: శక్తిమంతమైన కెమెరాను నింగిలోకి పంపే పనిలో ఇస్రో
Last Updated : Nov 19, 2019, 1:39 PM IST
TAGGED:
richard attenbaro