తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పౌరసత్వ సవరణ చట్టంపై ఈయూ పార్లమెంట్​లో తీర్మానం - పౌరసత్వ సవరణ చట్టంపై ఈయూ పార్లమెంట్​లో తీర్మానం

సీఏఏకు వ్యతిరేకంగా యూరోపియన్​ యూనియన్​ పార్లమెంటులో చర్చ జరగనుంది. ఈ మేరకు ఇదివరకే తీర్మానం ప్రవేశపెట్టగా.. దీనిపై బుధవారం చర్చించి, గురువారం ఓటింగ్​ కూడా నిర్వహించనున్నారు.

Revolution introduced in EU parliament over CAA
పౌరసత్వ సవరణ చట్టంపై ఈయూ పార్లమెంట్​లో తీర్మానం

By

Published : Jan 27, 2020, 5:47 AM IST

Updated : Feb 28, 2020, 2:34 AM IST

పౌరసత్వ సవరణ చట్టంపై ఈయూ పార్లమెంట్​లో తీర్మానం

భారత పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా యూరోపియన్ యూనియన్​ పార్లమెంటులో చర్చ జరగనుంది. ఇప్పటికే సీఏఏకు వ్యతిరేకంగా బ్రస్సెల్స్‌లోని ఈయూ పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టగా.. దీనిపై బుధవారం చర్చ చేపట్టి గురువారం ఓటింగ్‌ కూడా జరపనున్నారు. ఈ చట్టం దేశ పౌరసత్వ అంశంలో ప్రమాదకర మార్పును సూచిస్తుందని.. యూరోపియన్‌ పార్లమెంటు సభ్యులు ఆరోపించారు.

తప్పుబట్టిన కేంద్రం

అయితే పౌరసత్వ సవరణ చట్టం విషయంలో ఈయూ పార్లమెంటు తీరును కేంద్ర ప్రభుత్వ వర్గాలు తప్పుబట్టాయి. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన చట్టసభల అధికారాలను ప్రశ్నించే చర్యలు తీసుకోరాదని స్పష్టం చేశాయి. సీఏఏ పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమని, పార్లమెంటు ఉభయసభల్లో చర్చ జరిపిన అనంతరం ప్రజాస్వామ్య బద్దంగా సవరణలు తీసుకొచ్చినట్లు తెలిపాయి. ఈ చట్టంతో ఎవరి పౌరసత్వం రద్దు కాదని, ఇతర దేశాల్లో పీడనకు గురవుతున్న మైనార్టీలకు పౌరసత్వం కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నాయి.

ఇదీ చూడండి : 'భారత్​కు ప్రస్తుతం సమర్థమైన ప్రతిపక్షం అవసరం'

Last Updated : Feb 28, 2020, 2:34 AM IST

For All Latest Updates

TAGGED:

Gangadhar Y

ABOUT THE AUTHOR

...view details