కరోనా దెబ్బకి మార్కెట్లో మాస్కులన్నీ మాయమయ్యాయి. ఎక్కడో ఓ చోట దొరికినా.. వందలు వెచ్చించి కొనుక్కోలేకపోతున్నారు సామాన్య జనం. అయితే కేరళలో ఈ మాస్కుల సంక్షోభాన్ని జయించేందుకు తనవంతు సాయం చేస్తోంది టైలర్ షనీఫా. ఒక్కసారి వాడి పడేసే మాస్కులు కాకుండా.. ఉతుక్కొని తిరిగి వాడుకోగలిగే ముసుగులను తయారు చేస్తోంది.
కేరళలో కొట్టరక్కరకు చెందిన షనీఫా.. దేశీయ ఖాదీ వస్త్రంతోనే పలుమార్లు ఉపయోగించగలిగే మాస్కులను తయారు చేస్తోంది. ఇప్పటికే 500 మాస్కులు కుట్టి, స్థానిక ఆస్పత్రిలో ఉచితంగా అందజేసింది. షనీఫా.