తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గంభీర్​పై ఎఫ్​ఐఆర్​ నమోదుకు ఆదేశం - PUBLIC MEETING

మాజీ క్రికెటర్​, తూర్పు దిల్లీ భాజపా లోక్​సభ అభ్యర్థి గౌతమ్​ గంభీర్​పై ఎఫ్ఐఆర్​ నమోదు చేయాలని పోలీసులను ఆ ప్రాంత ఎన్నికల అధికారి ఆదేశించారు. అనుమతి లేకుండా బహిరంగ సభ ఏర్పాటు చేయడమే కారణమని తెలిపారు.

గౌతమ్​ గంభీర్​

By

Published : Apr 27, 2019, 5:50 PM IST

మాజీ క్రికెటర్​, భాజపా నేత గౌతమ్​ గంభీర్​పై ఎఫ్​ఐఆర్​ నమోదు చేయాలని తూర్పు దిల్లీ ఎన్నికల అధికారి కె.మహేష్​ పోలీసులను ఆదేశించారు.

అనుమతి లేకుండా జంగ్​పురలో బహిరంగ సభ ఏర్పాటు చేసినందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు​ తెలిపారు.

గత నెలలో పార్టీలో చేరిన గౌతమ్​ గంభీర్​కు తూర్పు దిల్లీ లోక్​సభ స్థానాన్ని కేటాయించింది భాజపా. ఈ నేపథ్యంలో ఆయన జగ్​పురలో గురువారం ఓ బహిరంగ సభ నిర్వహించారు. అయితే ఈ సభకు ఎలాంటి అనుమతి తీసుకోలేదని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details