కరోనా సంక్షోభం కారణంగా సొంత ప్రాంతాలకు తిరిగొచ్చిన 6 రాష్ట్రాల్లోని వలస కార్మికులకు 160 రైల్వే ప్రాజెక్టుల ద్వారా ఉపాధి లభిస్తుందని రైల్వే బోర్డు ఛైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ వెల్లడించారు. రైల్వేలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం చేపట్టబోయే ఈ ప్రాజెక్టులతో ఇటీవలే ప్రారంభమమైన 'గరీబ్ కల్యాణ్ రోజ్గార్ అభియాన్' కార్యక్రమం ద్వారా 6 రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో వలస కార్మికులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఇందుకు సంబంధించిన వివరాలు పేర్కొన్నారు.
" బిహార్, ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, ఝార్ఖండ్ వ్యాప్తంగా 116 జిల్లాల్లో సొంత ప్రాంతాలకు తిరిగొచ్చిన వలస కార్మికులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు 160 రైల్వే ప్రాజెక్టుల ద్వారా ఉపాధి లభిస్తుంది. మౌలిక వసతుల కల్పన కోసం చేపట్టిన ఈ ప్రాజెక్టుల పనులకు 8వేల 828మంది కార్మికులు అవసరం. జూన్ 20న పనులు ప్రారంభమయ్యాయి. 125 రోజులపాటు కార్మికులు ఉపాధి పొందుతారు. ఈ ప్రాజెక్టుల విలువ రూ.1888 కోట్లు "