తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రేమానురాగాల భారత్​ను తిరిగి తీసుకురండి: ఆజాద్​ - congresss

కాంగ్రెస్​ సీనియర్​ నేత గులాం నబీ ఆజాద్ భాజపా ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ప్రస్తుతం దేశంలో తోటి వారిని చూసి భయపడాల్సిన పరిస్థితి నెలకొందని ఆరోపించారు. అన్ని వర్గాలవారు అన్యోన్యంగా ఉన్నఒకప్పటి భారత్​ను తిరిగి తీసుకురావాలని మోదీ ప్రభుత్వాన్ని కోరారు ఆజాద్​.

ప్రేమానురాగాల భారత్​ను తిరిగి తీసుకురండి : ఆజాద్​

By

Published : Jun 25, 2019, 4:38 AM IST

ఎన్డీఏ సర్కారుపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్​. జాతిపిత మహాత్మా గాంధీని హత్యచేసిన వారిని కీర్తించే వారు భాజపాలో ఉన్నారని ఆరోపించారు. ప్రస్తుతం దేశంలో విద్వేషం, మూకహత్యలు పతాక స్థాయికి చేరాయని తీవ్రంగా విమర్శించారు.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ పార్లమెంటులో తీర్మనాన్ని ప్రవేశ పెట్టి చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆజాద్ మాట్లాడుతూ... దేశంలో ఒకప్పుడు అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి ప్రేమానురాగాలతో ఆప్యాయంగా జీవించారని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. నేరాలు, బాలికలపై అత్యాచారాలు గతంలో ఎన్నడూ లేనంతగా జరుగుతున్నాయని ఆరోపించారు​. హింస, మూకహత్యలకు జార్ఖండ్ నిలయమైందని ధ్వజమెత్తారు ఆజాద్​. అన్ని మతాల ప్రజలు సంతోషంగా జీవించిన ఒకప్పటి భారత్​ను తిరిగితీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు​.

ఎన్డీఏకు పూర్తి మెజారిటీ ఉన్నందున మహిళలకు 50శాతం రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలన్నారు ఆజాద్​.

ఇదీ చూడండి: 'దృఢమైన నాయకుని అవసరం కాంగ్రెస్ వల్లే తెలిసింది'

ABOUT THE AUTHOR

...view details