భారత సరిహద్దుల్లో చైనా హింసకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆ దేశ ఆహార ఉత్పత్తులను భారతీయులు బహిష్కరించాలని కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి రాందాస్ అఠవాలే పిలుపునిచ్చారు. ప్రభుత్వం కూడా దేశంలోని చైనా హోటళ్లు, రెస్టారెంట్లపై నిషేధం విధించాలని సూచించారు. భారత్‌లో చైనా రెస్టారెంట్లు నిర్వహించేవారు వాటిని మూసివేయాలన్నారు రాందాస్.
భారత్- చైనా సరిహద్దులో గాల్వాన్ లోయ వద్ద చెలరేగిన తీవ్ర ఘర్షణలో మన దేశానికి చెందిన 20 మంది సైనికులు వీరమరణం పొందిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.