మద్యం అమ్మకాలపై కర్ణాటక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం దుకాణాలతో పాటు బార్లు, రెస్టారెంట్లు, పబ్లు మద్యం విక్రయాలు జరుపుకోవచ్చని తాజాగా లాక్డౌన్ నుంచి సడలింపులిచ్చింది. నేటి (మే 9) నుంచి 17వ తేదీ వరకు ఈ అనుమతి ఉంటుందని తెలిపింది.
రిటైల్ ధరలకు మాత్రమే మద్యం విక్రయాలు జరపాలని, పర్మిట్ రూంలకు అనుమతి లేదని స్పష్టం చేసింది.
దాదాపు 40 రోజుల లాక్డౌన్ తర్వాత ఇటీవలే మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతిచ్చింది కేంద్రం. లాక్డౌన్తో ప్రభుత్వానికి ఆదాయం భారీగా తగ్గిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అన్ని రాష్ట్రాలు కేంద్రం నిబంధనలనే పాటిస్తున్నాయి.
కర్ణాటక ఆరోగ్య శాఖ ప్రకారం.. రాష్ట్రంలో 753 కరోనా కేసులు నమోదయ్యాయి. 346 మంది చికిత్స పొందుతున్నారు. 376 మంది కొవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 30 మంది కరోనా కాటుకు బలయ్యారు.
ఇదీ చూడండి:భారత్లో 1981కి పెరిగిన కరోనా మరణాలు