తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మున్సిపల్​ ఎన్నికలకు ముందు మహా'రిసార్ట్​' పాలిటిక్స్​ - మహారాష్ట్రలో భాజపా, శివసేన రిసార్టు రాజకీయాలు

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్, ఎన్​సీపీ, శివసేన సన్నద్ధమవుతున్న నేపథ్యంలో నాసిక్ మున్సిపల్ ఎన్నికలు రావడం తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. మేయర్ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న భాజపా, శివసేనలు ముందు జాగ్రత్త చర్యగా తమ కార్పొరేటర్లను రిసార్టులకు తరలిస్తున్నాయి.

మున్సిపల్​ ఎన్నికలకు ముందు మహా'రిసార్ట్​' పాలిటిక్స్​

By

Published : Nov 17, 2019, 4:56 AM IST

Updated : Nov 17, 2019, 3:03 PM IST

మున్సిపల్​ ఎన్నికలకు ముందు మహా'రిసార్ట్​' పాలిటిక్స్​

మహారాష్ట్రలో నవంబర్​ 22న జరుగనున్న నాసిక్ మేయర్​ ఎన్నికలకు భాజపా, శివసేన సన్నద్ధమవుతున్నాయి. మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల కోసం తమ అభ్యర్థులను రంగంలోకి దింపాయి.​ కాంగ్రెస్, ఎన్​సీపీ, శివసేన కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో నాసిక్ మున్సిపల్ ఎన్నికలు రావడం తీవ్ర ఆసక్తిని రేకిత్తిస్తోంది.

రిసార్టు రాజకీయాలు

నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్​లో భాజపాకు మెజారిటీ ఉంది. అయితే ముందు జాగ్రత్తగా తమ పార్టీకి చెందిన 65 మంది కార్పొరేటర్లలో 48 మందిని లోనావాలాలోని ఓ రిసార్టుకు తరలించింది.

మరోవైపు శివసేన కూడా తన 34 మంది కార్పొరేటర్లను ముంబయి సమీపంలోని దహను రిసార్టులో ఉంచింది.

నాసిక్ మన్సిపాలిటీ

120 మంది సభ్యుల నాసిక్ మున్సిపాలిటీలో భాజపాకు - 65, శివసేనకు- 34, ఎన్​సీపీకి- 6, ఆర్​పీఐకి- 1, ఎమ్​ఎన్​ఎస్​కి​- ఐదుగురు కార్పొరేటర్లు ఉన్నారు.

ప్రస్తుత మేయర్ రంజనా భన్సీ పదవీకాలం సెప్టెంబర్​ 15తోనే ముగిసిపోయింది. అయితే అసెంబ్లీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున వారి పదవీ కాలాన్ని డిసెంబర్ 15 వరకు పొడిగించారు.

'మహా' రాజకీయం

ముఖ్యమంత్రి పీఠం కోసం భాజపా, శివసేన మధ్య విబేధాలు రావడం, ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీకి సరైన మెజారిటీ లేని కారణంగా మహారాష్ట్రలో రాష్ట్రపతిపాలన కొనసాగుతోంది. అయితే కాంగ్రెస్, ఎన్​సీపీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి శివసేన ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

భాజపా బేరసారాలు

శివసేన-ఎన్​సీపీ ప్రభుత్వం ఆరు నెలలు కూడా మనలేదని మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణనీస్ వ్యాఖ్యానించారు. మరోవైపు త్వరలోనే మహారాష్ట్రలో భాజపా ప్రభుత్వం ఏర్పాటుచేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్​ ప్రకటించారు. భాజపా నేతల ప్రకటనలు చూస్తుంటే.. ఎమ్మెల్యేల కొనుగోలుకు కాషాయం పార్టీ సన్నద్ధం అవుతున్నట్లు సందేహాలు కలుగుతున్నాయని శివసేన ఆరోపించింది.

ఇదీ చూడండి:గవర్నర్​తో ఎన్సీపీ, కాంగ్రెస్, సేన నేతల భేటీ వాయిదా

Last Updated : Nov 17, 2019, 3:03 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details