- 2014 ధెమ్చోక్... భారత్- చైనా సైన్యాల మధ్య మూడు వారాల పాటు ఘర్షణ
- 2015 లద్దాఖ్‌లోని బర్ట్సే... వారం రోజుల సైనిక వివాదం
- 2017 డోక్లామ్... భారత్, చైనా, భూటాన్ ట్రైజంక్షన్‌లో 70 రోజుల సైనిక ప్రతిష్టంభన
- 2020 గాల్వన్ లోయ... 45 ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో హింసాత్మక ఘర్షణ
సమయం మారుతుంది. ప్రదేశం మారుతుంది. కానీ చైనా తీరులో మాత్రం మార్పు లేదు. 1962లో జరిగిన సంక్షిప్త యుద్ధం నుంచి డ్రాగన్ దేశం ఇలా కవ్వింపులకు దిగుతూనే ఉంది.
సరిహద్దులో సాధారణంగా ఏటా 400-500 వరకు చొరబాట్లు జరుగుతాయి. కానీ ఈ వివాదాలన్నీ త్వరగానే పరిష్కారమవుతాయి. అయితే డ్రాగన్ ఎత్తుడగలు ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదు. మొత్తం 3,440 కి.మీ పొడవైన వాస్తవాధీన(ఎల్‌ఏసీ) రేఖ వెంబడి ప్రతి చోటా వివాదాలు రాజేస్తోంది. మూడు సెక్టార్లుగా విభజితమైన ఈ ఎల్‌ఏసీ వెంట ఉన్న వివిధ భూభాగాలు తమదేంటూ ఆరోపిస్తోంది. దీటుగా, వేగంగా స్పందించే సమయం భారత్‌కు లేకుండా ఒక్కోసారి ఒక్కో చోట్ల పన్నాగాలు పన్నుతోంది.
పశ్చిమ సెక్టార్‌లో అక్సాయిచిన్, దెమ్‌చోక్... మధ్య సెక్టార్‌లో పాంగాంగ్ సరస్సు, గాల్వాన్ లోయ, దౌలత్ బేగ్ ఓల్డీ- తూర్పు సెక్టార్‌లో లోంగ్జూ, నమ్కా చూ లోయ, సుమ్‌దోరాంగ్ చూ, యాంగ్జే ప్రాంతాల్లో చైనా ఇదివరకు ఘర్షణలకు పాల్పడింది. గాల్వన్ లోయ చుట్టూ మూడు ప్రాంతాల్లో, లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సు సమీపంలో మరో చోట ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
సన్నద్ధమయ్యేసరికి మరో చోట..