తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భాజపాకు షాక్​- ఎన్​ఆర్​సీకి వ్యతిరేకంగా 'బిహార్'​ తీర్మానం

ఎన్​ఆర్​సీ విషయంలో భాజపాకు అనూహ్య పరిణామం ఎదురైంది. ఎన్​డీఏ అధికారంలో ఉన్న రాష్ట్రం​లోనే జాతీయ పౌర పట్టికను వ్యతిరేకిస్తూ శాసనసభ తీర్మానం చేసింది. ఎన్​పీఆర్​ అమలు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది బిహార్ ప్రభుత్వం.

resolution-passed-against-caa-npr-and-nrc-issues-in-bihar-assembly
భాజపాకు షాక్​- ఎన్​ఆర్​సీకి వ్యతిరేకంగా 'బిహార్'​ తీర్మానం

By

Published : Feb 25, 2020, 3:31 PM IST

Updated : Mar 2, 2020, 12:54 PM IST

దేశవ్యాప్తంగా జాతీయ పౌర పట్టిక-ఎన్​ఆర్​సీ అమలును వ్యతిరేకిస్తూ బిహార్​ శాసనసభ తీర్మానం చేసింది. త్వరలో అమలు కావాల్సిన జాతీయ జనాభా పట్టిక-ఎన్​పీఆర్​ విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్​పీఆర్​ను మోదీ ప్రభుత్వం ప్రతిపాదించిన పద్ధతిలో కాక యూపీఏ హయాం(2010) నాటి విధానంలో స్వల్ప మార్పులతో రూపొందించాలని తీర్మానించింది.

భాజపాకు ఎదురుదెబ్బ!

దేశవ్యాప్తంగా ఎన్​ఆర్​సీపై కొంతకాలంగా తీవ్ర దుమారం రేగుతోంది. భాజపాయేతర పార్టీల పాలనలోని రాష్ట్రాల శాసనసభలు ఇప్పటికే ఎన్​ఆర్​సీకి వ్యతిరేకంగా తీర్మానాలు చేశాయి. అయితే... ఎన్​డీఏ(జేడీయూ-భాజపా) అధికారంలో ఉన్న బిహార్​లోనే ఇలాంటి తీర్మానం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

బిహార్​లో ఈ ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్​ఆర్​సీ విషయంలో నితీశ్​ ప్రభుత్వం మిత్రపక్షం(భాజపా) వైఖరికి భిన్నంగా వ్యవహరించడం చర్చనీయాంశమైంది. ఎన్​పీఆర్​ విషయంలోనూ స్వయంగా నితీశ్​ కుమార్​ అభ్యంతరాలు లేవనెత్తడం గమనార్హం. కొత్త ఎన్​పీఆర్​ దరఖాస్తుల్లోని వివాదాస్పద నిబంధనల్ని తొలిగించాలని కేంద్రానికి లేఖ రాసినట్లు శాసనసభలో చర్చ సందర్భంగా చెప్పారు నితీశ్​.

Last Updated : Mar 2, 2020, 12:54 PM IST

ABOUT THE AUTHOR

...view details