తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వైద్యుల సమ్మె ఉద్ధృతం.. అత్యవసర సేవలూ బంద్​ - మూడో రోజుకు సమ్మె

ఎన్​ఎంసీ బిల్లుకు నిరసనగా దేశవ్యాప్తంగా వైద్యుల సమ్మె కొనసాగుతోంది. రాజ్యసభలోనూ బిల్లు ఆమోదం పొందిన కారణంగా సమ్మెను ఉద్ధృతం చేశారు జూడాలు. అత్యవసర సేవలనూ బహిష్కరించాలని నిర్ణయించారు.

వైద్యుల సమ్మె ఉదృతం

By

Published : Aug 2, 2019, 7:58 AM IST

జాతీయ వైద్య కమిషన్​(ఎన్​ఎంసీ) బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వైద్యుల నిరసనలు కొనసాగుతున్నాయి. జూడాల సమ్మెతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

శుక్రవారమూ నిరవధిక సమ్మె కొనసాగించాలని ఫెడరేషన్​ ఆఫ్​ రెసిడెంట్​ డాక్టర్స్​ అసోసియేషన్​ నిర్ణయించింది. ఎయిమ్స్​ దిల్లీ, పట్నా వైద్యులుసమ్మెకుమద్దతు ప్రకటించారు. నేటి నుంచి అత్యవసర సేవల్లోనూ పాల్గొనేది లేదని తేల్చిచెప్పారు.

సమ్మెకు మద్దతు

ఎన్​ఎంసీ బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం లభించడం వల్ల సమ్మెను మరింత ఉద్ధృతం చేయనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో వివిధ ఆసుపత్రులకు చెందిన వైద్యుల బృందం నేడు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్​తో సమావేశమయ్యే అవకాశముంది.
మరోవైపు ఎన్ఎంసీ బిల్లు ఆమోదం పొందితే వైద్యవిద్యలో విప్లవాత్మక మార్పులు వస్తాయని మంత్రి హర్షవర్ధన్‌ చెబుతున్నారు.

ఇదీ చూడండి: అయోధ్య మధ్యవర్తిత్వం నివేదికపై నేడు సుప్రీం విచారణ

ABOUT THE AUTHOR

...view details