కరోనా వైరస్ వ్యాధికి వ్యాక్సిన్, మందులను కనుగొనేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కేరళలోనూ కరోనా వ్యాప్తిని నియంత్రించే పద్ధతులు, వ్యాక్సిన్ల అభివృద్ధిపై పరిశోధనలు చేస్తున్నారు.
కొట్టాయంలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ పరిశోధకులు పలు అంశాలపై దృష్టి సారించారు. ఆరోగ్య సిబ్బంది ధరించే వ్యక్తిగత సంరక్షణ పరికరాల (పీపీఈ)ను శుభ్రం చేసే విధానాలపై పరిశోధిస్తున్నారు.
విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ సాబు థామస్ నేతృత్వంలో ఈ పరిశోధనలు సాగుతున్నాయి. కరోనాను పసుపులోని కర్కమిన్ అనే పదార్థం నియంత్రించగలదని ఆశిస్తున్నారు. ఆ దిశగా మూడు ప్రాజెక్టులపై కృషి చేస్తున్నారు.