తెలంగాణ

telangana

ETV Bharat / bharat

40 అడుగుల బావిలో పడిన ఒంటె- ఎట్టకేలకు బయటికి - camel in well rescued in bhuj

40 అడుగుల లోతు బావిలో పడిపోయిన ఓ మూగజీవాన్ని కాపాడారు గుజరాత్​ అగ్నిమాపక సిబ్బంది. చిమ్మచీకటిలో 9 గంటల పాటు శ్రమించి బావిలోంచి ఒంటెను బయటకి తీశారు.

camel
బావిలో పడ్డ ఒంటె ప్రాణాలు కాపాడారు!

By

Published : Jun 12, 2020, 3:29 PM IST

గుజరాత్​ కచ్​ జిల్లా భుజ్​లో బావిలో పడ్డ ఒంటెను రాత్రంతా శ్రమించి బయటకు తీశారు అగ్నిమాపక​ సిబ్బంది.

బావిలో పడ్డ ఒంటె ప్రాణాలు కాపాడారు!

ఝింకడీ గ్రామంలో యజమాని ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న ఓ ఒంటె అనుకోకుండా 40 అడుగుల లోతున్న బావిలో పడిపోయింది. ఇది చూసిన గ్రామస్థులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది బావిలో పడ్డ ఒంటె ప్రాణాలతోనే ఉన్నట్టు గమనించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.

బావిలో పడ్డ ఒంటె ప్రాణాలు కాపాడారు!

ఎన్నో రకాలుగా ప్రయత్నించినా ఒంటె బయటికి రాలేదు. దీంతో ఆ చీకటిలోనే ప్రాణాలకు తెగించి బావిలోకి దిగారు అగ్నిమాపక సిబ్బంది. ఒంటె చుట్టూ తాళ్లు కట్టారు. సిబ్బంది పైకి లాగారు. 9 గంటలు శ్రమించి ఒంటెను సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. దీంతో ఒంటె యజమాని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. చిన్న గాయాలు కావడం వల్ల ఒంటెకు చికిత్స చేశారు.

బావిలో పడ్డ ఒంటె ప్రాణాలు కాపాడారు!

ఇదీ చదవండి:బ్లాక్ అండ్ వైట్ టీవీ చూసి.. నెట్​ఫ్లిక్స్ వైస్​ప్రెసిడెంట్​గా..!

ABOUT THE AUTHOR

...view details