తమిళనాడు తిరుచిరాపల్లిలో బోరుబావిలో పడిన చిన్నారిని రక్షించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సహాయక చర్యలు కొనసాగిస్తామని... చిన్నారిని కాపాడే ఏ అవకాశాన్ని వదులుకోమని రెవెన్యూ శాఖ కమిషనర్ రాధాకృష్ణన్ స్పష్టం చేశారు. బాలుడి ప్రాణాలపై ఆశలు వదులుకోమని తల్లిదండ్రులకు ఎలాంటి తప్పుడు సమాచారం ఇవ్వమన్నారు. సుజిత్ విల్సన్‌ను బయటకు తీసుకొచ్చేందుకు అత్యాధునిక పరికరాలు వాడుతున్నట్లు స్పష్టం చేశారు.
''చిన్నారిని కాపాడేందుకు చేయాల్సినవన్నీ చేస్తున్నాం. బాలుడు ఒక ప్రదేశంలో చిక్కుకున్నాడు. మరింత లోపలికి వెళ్లలేడు. అతనిపై ఏ మాత్రం ప్రభావం పడకుండా క్షేమంగా బయటకు తీసుకురావాలనుకుంటున్నాం.''
- రాధాకృష్ణన్, తమిళనాడు రెవెన్యూ శాఖ కమిషనర్