భారత వాయుసేనకు చెందిన ఏఎన్-32 విమానం కూలిన ప్రదేశంలో సైన్యం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. ఎమ్ఐ-17విమానాలు సహా అత్యాధునిక లైట్ హెలికాప్టర్లను రంగంలోకి దింపింది సైన్యం.
ఈ నెల 3న గల్లంతైన ఏఎన్-32 విమాన శకలాలను మంగళవారం ఐఏఎఫ్ గుర్తించింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని సియాంగ్ జిల్లా పయూమ్ సమీపంలో కూలిపోయినట్లు గుర్తించారు. విమాన శకలాలు దొరికిన నేపథ్యంలో అందులోని 13 మంది కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు అధికారులు.
ఇదీ జరిగింది..
జూన్ 3 మధ్యాహ్నం 12.25 గంటలకు అసోంలోని జోర్హాట్ వైమానిక స్థావరం నుంచి బయలుదేరింది ఏఎన్-32 విమానం. కొద్ది సేపటికే విమానం గల్లంతైంది. అది అరుణాచల్ ప్రదేశ్ మెన్చుకా అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్‌కు చేరుకోవాల్సి ఉంది. ఇందులో 8 మంది సిబ్బంది, ఐదుగురు ప్రయాణికులు కలిపి 13 మంది ఉన్నారు. మంగళవారం విమాన శకలాలను కనుగొన్నారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని ఐఏఎఫ్ తెలిపింది.
ఇదీ చూడండి:-బాలిక మృతదేహాన్ని దేవుడికి అర్పించిన గ్రామస్థులు