రెండున్నరేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిన ఘటన తమిళనాడులోని త్రిచి జిల్లాలో చోటుచేసుకుంది. బాలుడిని రక్షించేందుకు అగ్నిమాపక దళం, ప్రభుత్వ అధికారులు రంగంలోకి దిగారు. ఐఐటీ మద్రాస్ తయారు చేసిన ప్రత్యేక పరికరంతో ఆ బాలుడిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. అయితే.. తొలుత 30 అడుగుల లోతులో ఉన్నట్లు భావిస్తున్న చిన్నారి.. సుమారు 70 అడుగుల లోతుకు పడిపోయాడు.
మనపరాయ్కి చెందిన సుజిత్.. ఇంటి సమీపంలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. గమనించిన స్థానికులు బాలుడిని రక్షించేందుకు ప్రయత్నం చేశారు. అనంతరం అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సుజిత్‌ను రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.