తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వరదలో చిక్కుకున్న యువకుడిని కాపాడిన వాయుసేన - వరదల్లో చిక్కుకున్న వ్యక్తి కాపాడిన వైమానిక దళం

జమ్ముకశ్మీర్​లోని నదిలో చిక్కుకున్న ఓ యువకుడిని రక్షించింది భారత వైమానిక దళం(ఐఏఎఫ్​). నౌషారా ప్రాంతంలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదిలో ఆ యువకుడు చిక్కుపోయాడు. దీంతో రంగంలోకి దిగిన ఐఏఎఫ్​ రెస్క్యూ టీమ్​... హెలికాప్టర్​తో అక్కడకు చేరుకొని కాపాడింది.

Rescue operation of indian airforce
వరదలో చిక్కుకున్న యువకుడిని కాపాడిన వైమానిక దళం

By

Published : Aug 27, 2020, 9:48 AM IST

కొన్ని రోజుల నుంచి జమ్ముకశ్మీర్​లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో దక్షిణ నౌషారా ప్రాంతంలోని నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. అయితే అనుకోకుండా ఓ వ్యక్తి ఆ నది మధ్య భాగంలో చిక్కుకుపోయాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానిక ప్రజలు వెంటనే సమాచారాన్ని పోలీసులకు తెలియజేశారు. అతన్ని రక్షించటానికి ఎంతో ప్రయత్నం చేశారు అధికారులు. కానీ సమయం గడిచే కొద్ది నది ప్రవాహం పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో అతడిని కాపాడేందుకు అధికారులు భారత సైన్యం సహాయం కోరింది.

వరదలో చిక్కుకున్న యువకుడిని కాపాడిన ఐఏఎఫ్​
యువకుడిని కాపాడిన వైమానిక దళం
యువకుడిని సురక్షిత ప్రాంతానికి తరలింపు
యువకుడిని కాపాడుతున్న వైమానిక దళం

అధికారుల విజ్ఞప్తి మేరకు భారత వైమానిక దళానికి చెందిన హెలికాఫ్టర్​ సాయంతో అధికారి గణేశ్​ ప్రసాద్​ ఆధ్వర్యంలోని​ బృందం​... ఘటనా స్థలికి చేరుకున్నారు. హెలికాఫ్టర్​ను ముందుగా ల్యాండ్​ చేయటానికి ప్రయత్నించారు. నదీ ప్రవాహం కారణంగా వారికి అనువైన ప్రదేశం కనిపించలేదు. దీంతో హెలికాఫ్టర్​ను గాలిలోనే బాధితుడికి చేరువలో ఉంచి.. ఇద్దరు ప్రత్యేక బృంద సభ్యులు తాడు సాయంతో కిందకు దిగారు. అనంతరం అతడిని అదే తాడుతో పైకి ఎక్కించి నౌషారా ప్రాంతంలోని మరో సురక్షిత ప్రాంతానికి తరలించారు. తర్వాత చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు అధికారులు.

ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న నది
వరదలో చిక్కుకున్న యువకుడు

అతడిని రక్షించటం ఏమాత్రం ఆలస్యమైనా ప్రవాహం ఎక్కువై అతడు చనిపోయేవాడని, కాపాడిన వైమానిక దళానికి కృతజ్ఞతలు తెలియజేశారు స్థానిక ప్రజలు.

ABOUT THE AUTHOR

...view details