ఫేస్బుక్, ట్విట్టర్.. ఇలా ఏ సామాజిక మాధ్యమంలోనైనా తానే రారాజునని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేకమార్లు ప్రకటించారు. ఫేస్బుక్లో అనుసరిస్తోన్న వారి సంఖ్యను దృష్టిలో పెట్టుకుని.. తాను నెం.1 అని, నెం.2 భారత ప్రధాని నరేంద్ర మోదీ అని ఇటీవల వ్యాఖ్యానించారు ట్రంప్.
అయితే.. 1.5 బిలియన్ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుండటం వల్ల మోదీకి అధిక ప్రయోజనం ఉంటుందని తాజాగా అభిప్రాయపడ్డారు ట్రంప్.
"వచ్చే వారం నేను భారత్కు వెళ్తున్నా. అక్కడ 150 కోట్ల మంది ప్రజలు ఉంటారు. ఫేస్బుక్లో మోదీది రెండో స్థానం. మొదటి స్థానం ఎవరిదో తెలుసా? ట్రంప్. నమ్మగలరా? నాకూ ఇప్పుడే తెలిసింది. కానీ మోదీకి అభినందనలు. ఆయన 1.5 బిలియన్ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నేను 350 మిలియన్ల మందికే. ఆయన నాకంటే ముందువరుసలో ఉన్నారు."