తెలంగాణ

telangana

ETV Bharat / bharat

''చైనాకు భారత్​ షాక్'​ వార్తలు అవాస్తవం' - భారత్ చైనా

పాంగాంగ్​ సో సరస్సు దక్షిణ తీరంలోని కీలక పర్వత శిఖరాన్ని భారత సైన్యం అధీనంలోకి తీసుకున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని సైనికాధికారులు వెల్లడించారు. ముందు జాగ్రత్త మోహరింపులో భాగంగా ఆగస్టు 30న కొన్ని చోట్ల సైనికుల పహారాలో మార్పులు చేర్పులు చేసినట్లు పేర్కొన్నారు.

Reports of Indian troops occupying heights at Finger 4 are not correct
చైనాకు భారత్​ షాక్​ వార్తలు అవాస్తవం

By

Published : Sep 2, 2020, 7:29 PM IST

భారత్​-చైనా వాస్తవాధీన రేఖ వెంబడి ఫింగర్ పర్వత శ్రేణులను భారత సైన్యం తమ అధీనంలోకి తీసుకున్నట్లు వచ్చిన వార్తలు నిజం కాదని సైనికాధికారులు స్పష్టం చేశారు. ముందు జాగ్రత్త మోహరింపులో భాగంగా ఆగస్టు 30న కొన్ని చోట్ల సైనికుల పహారాలో మార్పులు చేర్పులు చేసినట్లు పేర్కొన్నారు. వాస్తవాధీన రేఖకు భారత్ వైపున ఉన్న పాంగాంగ్ సో సరస్సు ఉత్తర భాగంలో ఉన్న పోస్టుల వద్ద పహారా సైనికుల మార్పు మాత్రమే జరిగినట్లు తెలిపారు.

పాంగాంగ్​ సో సరస్సు దక్షిణ తీరంలోని కీలక పర్వత శిఖరాన్ని భారత సైన్యం అధీనంలోకి తీసుకున్నట్లు మంగళవారం వార్తలు వచ్చాయి.

ఇదీ చూడండి: చైనాకు షాక్​- భారత్ అధీనంలో కీలక ప్రాంతం​

ABOUT THE AUTHOR

...view details