తెలంగాణ

telangana

ETV Bharat / bharat

డిసెంబర్​లో 'జాతీయ రైల్ ప్రణాళిక' తుది నివేదిక - రైల్వే ప్రాజెక్టుల వివరాలు

దేశంలో రైల్ నెట్​వర్క్​ విస్తరించేందుకు ప్రతిపాదించిన 'జాతీయ రైల్ ప్రణాళిక-2030' ముసాయిదాను సిద్ధం చేసినట్లు రైల్వే బోర్డు తెలిపింది. వచ్చే డిసెంబర్​లో తుది నివేదికను విడుదల చేస్తామని బోర్డు ఛైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ వెల్లడించారు.

National Rail Plan
జాతీయ రైల్ ప్రణాళిక

By

Published : Oct 16, 2020, 5:51 AM IST

'జాతీయ రైల్ ప్రణాళిక- 2030' ముసాయిదా నివేదికను ఇప్పటికే సిద్ధం చేశామని రైల్వే బోర్డు ఛైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ తెలిపారు. దేశంలో రైల్ నెట్​వర్క్​ను విస్తరించే ఉద్దేశించిన ఈ ప్రణాళిక తుది నివేదికను ఈ ఏడాది డిసెంబర్​లో విడుదల చేస్తామని స్పష్టం చేశారు.

"దేశంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ప్రొజెక్షన్ చేశాం. ప్రస్తుతం జరుగుతున్న, భవిష్యత్తులో చేపట్టాల్సిన ప్రాజెక్టులపై పరిశీలనలోకి తీసుకున్నాం. 2030లో అవసరాలను దృష్టిలో పెట్టుకుని రైల్వే నెట్​వర్క్​ను విస్తరించేందుుకు కృషి చేస్తున్నాం. ఇప్పటికే 2024 ఏడాదికి సంబంధించి బ్లూప్రింట్ సిద్ధం చేశాం. 2024 మార్చి వరకు అన్ని ప్రాజెక్టులకు అవసరమైన బడ్జెట్​ను ఇప్పటికే నిర్ణయించాం."

- వినోద్ కుమార్ యాదవ్​

2024 మార్చి వరకు చేపట్టే అన్ని ప్రాజెక్టుల వివరాలను పుస్తక రూపంలో అన్ని జోనల్ రైల్వేలకు 2 వారాల్లో అందజేస్తామని తెలిపారు వినోద్. రైల్వే ట్రాకుల రెట్టింపు, విద్యుద్ధీకరణ, ఫ్రైట్ కారిడార్లు, బొగ్గు రవాణాకు సంబంధించిన 51 ప్రాజెక్టుల వివరాలు ఇందులో ఉంటాయని స్పష్టం చేశారు.

సరుకు రవాణా ఆదాయం ఈ ఏడాది 11 శాతం పెరిగిందని వినోద్ తెలిపారు. రైతుల నిరసనల కారణంగా పంజాబ్​లో నిలిపేసిన రైలు సేవలను పరిస్థితులు సద్దుమణిగాక పునరుద్ధరిస్తామని తెలిపారు.

ఇదీ చూడండి:మరో నెల రోజుల్లో రఫేల్​ రెండో బ్యాచ్​

ABOUT THE AUTHOR

...view details