తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వాజ్​​పేయీ ద్వితీయ వర్ధంతి.. ప్రముఖుల నివాళి - Bharatiya Janata Party

దివంగత అటల్​ బిహారీ వాజ్​పేయీ ద్వితీయ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా పలువురు భాజపా నేతలు మాజీ ప్రధానికి నివాళులర్పించారు. మహానేత సేవలను స్మరించుకున్నారు.

Remembering Atal Bihar Vajpayee on his 2nd death anniversary
వాజ్​పేయీ ద్వితీయ వర్ధంతి- ప్రముఖల నివాళి

By

Published : Aug 16, 2020, 7:59 AM IST

Updated : Aug 16, 2020, 8:45 AM IST

భారత మాజీ ప్రధాని, దివంగత అటల్​ బిహారీ వాజ్​పేయీ ద్వితీయ వర్ధంతి నేడు. మహానేతకు నివాళులు అర్పించడానికి భాజపా అగ్రనేతలు, ప్రముఖులు దిల్లీలోని వాజ్​పేయీ స్మారకం 'సదైవ్​ అటల్'కు తరలివెళ్తున్నారు.

నివాళులు అర్పించడానికి 'సదైవ్​ అటల్'కు చేరుకున్న ప్రముఖులు

భారత పురోగతిలో వాజ్​పేయీ పాత్ర అమోఘమని కొనియాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆయన సేవలను దేశ ప్రజలూ ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటారని ట్వీట్​ చేశారు. దిల్లీలోని వాజ్​పేయీ స్మారకం 'సదైవ్​ అటల్' వద్దకు చేరుకొని.. ఆయనకు నివాళులర్పించారు. ​

వాజ్​పేయీకి నివాళులు అర్పిస్తున్న ప్రధాని మోదీ

"దేశాభివృద్ధికి వాజ్​పేయీ చేసిన సేవలు చిరస్మరణీయం. ఎల్లప్పుడూ వాటిని భారత ప్రజలు గుర్తుంచుకుంటారు."

- నరేంద్ర మోదీ, భారత ప్రధాని.

రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్..​. సదైవ్​ అటల్​కు చేరుకొని వాజ్​పేయీకి నివాళులర్పించారు. మాజీ ప్రధానమంత్రి దేశానికి చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

వాజ్​పేయీకి నివాళులు అర్పిస్తున్న రాష్ట్రపతి
సదైవ్​ అటల్ వద్ద ప్రధాని, రాష్ట్రపతి

"ఉదార ప్రజాస్వామ్య విలువలను మోసే 'అజాతశత్రువు', జాతీయవాద కవి, నైపుణ్యం కలిగిన నిర్వాహకుడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ."

- ఎం వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి

ఇదీ చూడండి:'కరోనాపై భయాన్ని తొలగించి.. అవగాహన కల్పించండి'

Last Updated : Aug 16, 2020, 8:45 AM IST

ABOUT THE AUTHOR

...view details