భాజపా నేతలు సాధ్వీ ప్రజ్ఞాసింగ్, అనంత్‌కుమార్ హెగ్దే, నళిన్ కటీల్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ అధ్యక్షుడు స్పష్టతనిచ్చారు. అవి వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనని, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించి క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించామన్నారు.
"వారి వ్యాఖ్యలు వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. అందులో భాజపాకు ఎలాంటి సంబంధం లేదు. వారి మాటలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పారు. అయినా పార్టీ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. ఇలాంటి మాటలు భాజపా భావజాలానికి, ప్రజాజీవనానికి పూర్తిగా వ్యతిరేకం. అందుకే వారిపై అంతర్గత విచారణ కమిటీని ఏర్పాటు చేశాం. ముగ్గురి నుంచి వివరణలు తీసుకున్నాక కమిటీ పదిరోజుల్లో నివేదిక సమర్పిస్తుంది."