తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బాబ్రీ మసీదు'కు 27 ఏళ్లు.. అయోధ్యలో భద్రత కట్టుదిట్టం - తాజా అయోధ్య వార్తలు

అయోధ్య బాబ్రీ మసీదు ఘటన జరిగి రేపటికి 27 ఏళ్లు కావస్తోంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా ఉత్తరప్రదేశ్​లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అనుమానం ఉన్న వారిని పోలీసులు ముందుగానే అదుపులోకి తీసుకున్నారు.

Religious leaders downplay Babri demolition anniversary
అయోధ్య ఘటనకు రెపటితో 27ఏళ్లు.. రాష్ట్రంలో భద్రత కట్టుదిట్టం

By

Published : Dec 5, 2019, 6:16 PM IST

అయోధ్యలోని బాబ్రీ మసీదు ఘటన జరిగి రేపటితో సరిగ్గా 27 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా ఉత్తర్​ప్రదేశ్​లో భద్రతను కట్టుదిట్టం చేసింది ప్రభుత్వం. అయోధ్యలో వివాదాస్పద స్థలంపై ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. అయోధ్య ఉన్న ఫైజాబాద్ ​జిల్లాను జోన్​లుగా విభజించి ఒక్కో జోన్​కు ఒక్కో ఎస్పీ పర్యవేక్షించేలా చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర అదనపు పోలీస్​ జనరల్​ రామశాస్త్రి వెల్లడించారు.

ముందస్తు జాగ్రత్తగా అనుమానం ఉన్న 305మందిని అదుపులోకి తీసుకున్నామని అయోధ్య ఎస్​ఎస్​పీ ఆశిష్ తివారీ తెలిపారు. అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నామని, క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఎలాంటి పుకార్లను నమ్మవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు. శాంతి సామరస్యం కోసం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు అధికారులు.

ఇదీ చదవండి:ఈ చేప ముఖం అచ్చం మనిషిలాగే ఉంది!

ABOUT THE AUTHOR

...view details