టవర్ల విధ్వంసంపై రిలయన్స్ దాఖలు చేసిన పిటిషన్ను పంజాబ్-హరియాణా హైకోర్టు విచారించింది. కేంద్రం సహా పంజాబ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వ్యాజ్యంపై స్పందించాలని ఆదేశించింది.
చట్టవిరుద్ధంగా టవర్ల ధ్వంసానికి పాల్పడుతున్నారని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ హైకోర్టులో సోమవారం పిటిషన్ వేసింది. ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకొని వీటికి అడ్డుకట్ట వేసేలా ఆదేశించాలని కోరింది.
వ్యవసాయ చట్టాలు కార్పొరేట్లకు మేలు చేస్తాయన్న ఆరోపణలతో రిలయన్స్ టవర్లపై దాడులకు పాల్పడుతున్నారన్న వార్తలపై సంస్థ స్పందించింది. రైతుల నుంచి నేరుగా ఎలాంటి ఉత్పత్తులు తమ సంస్థ కొనుగోలు చేయడం లేదని స్పష్టం చేసింది. కాంట్రాక్ట్ వ్యవసాయం చేయడం లేదని తేల్చిచెప్పింది.