రిలయన్స్ గ్రూపుల ఛైర్మన్ అనిల్ అంబానీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను ఆ సంస్థ ఖండించింది. కాంగ్రెస్ అధ్యక్షుడి ఆరోపణలు నిరాధారమైనవని వెల్లడించింది. నిరాధార, అసత్య, తప్పుడు సమాచారాలతో తమ సంస్థను ప్రస్తావిస్తూ రాహుల్ ఎన్నికల ప్రచారాలు సాగిస్తున్నారని విమర్శించింది.
యూపీఏ హయాంలోనే విద్యుత్, టెలికాం, రహదారులు, మెట్రో ప్రాజెక్టులకు సంబంధించి రూ.లక్ష కోట్ల విలువైన కాంట్రాక్టులు తమ సంస్థకు వచ్చాయని రిలయన్స్ తెలిపింది.