కశ్మీర్ బలగాల గుప్పెట్లో లేదని, ఒక్కొక్కటిగా ఆంక్షలను సడలిస్తున్నామని సుప్రీం కోర్టుకు కేంద్రం నివేదించింది. ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సర్వోన్నత న్యాయస్థానానికి కశ్మీర్ పరిస్థితులపై నివేదిక సమర్పించారు. కశ్మీర్లో ఆంక్షలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు వాదనలు ఆలకించింది.
"కశ్మీర్లో ఆగస్టు 13 నుంచి ఆంక్షలు సడలిస్తున్నాం. పిటిషనర్లు పేర్కొన్నట్లు కశ్మీర్ ఆంక్షల నీడలో లేదు. సీనియర్ కాంగ్రెస్ నేత గులాం నబీ అజాద్ వేసిన పిటిషన్లో పేర్కొన్న విషయాలు అవాస్తవం, అసంబద్ధం."
- కేంద్రం