నిర్భయ సామూహిక అత్యాచారం కేసు దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ చేసుకున్న క్షమాభిక్ష పిటిషన్ కేంద్ర హోంశాఖకు చేరింది. ఇప్పటికే క్షమాభిక్ష అభ్యర్థనను తిరస్కరించిన దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్..... ఈ పిటిషన్‌ను కేంద్ర హోం శాఖకు పంపారు. క్షమా భిక్ష అభ్యర్థనను పరిశీలించనున్న కేంద్ర హోం శాఖ.... తుది నిర్ణయం కోసం త్వరలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పంపనుంది.
కేంద్ర హోంశాఖ వద్దకు నిర్భయ దోషి క్షమాభిక్ష పిటిషన్
నిర్భయ దోషి క్షమాభిక్ష కోరుతూ వేసిన పిటిషన్ కేంద్ర హోంశాఖకు చేరింది. దిల్లీ ప్రభుత్వం, దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఇప్పటికే దోషి క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించగా.. రాష్ట్రపతి తుది నిర్ణయం తుది నిర్ణయం తీసుకోనున్నారు.
కేంద్ర హోంశాఖ వద్దకు నిర్భయ దోషి క్షమాభిక్ష పిటిషన్
హైదరాబాద్‌లో దిశ హత్యాచారంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. దిల్లీ ప్రభుత్వం వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించింది. నిర్భయ అత్యాచారం కేసులో దోషులకు సత్వర శిక్ష అమలు కోసం దిల్లీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు రాష్ట్రపతి తుది నిర్ణయం కోసం వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్‌ను కేంద్ర హోంశాఖకు పంపింది.
ఇదీ చదవండి: 'నిర్భయ' దోషికి క్షమాభిక్ష వద్దు: దిల్లీ ప్రభుత్వం