మీడియాను నియంత్రించాలనుకుంటే... తొలుత డిజిటల్ మీడియాతో ప్రారంభించాలని సుప్రీంకోర్టుకు తెలిపింది కేంద్రం. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల వల్ల సమాచారం క్షణాల్లో వైరల్‌గా మారే అవకాశం ఉండటమే ఇందుకు కారణంగా వివరించింది.
'ముందు నియంత్రించాల్సింది డిజిటల్ మీడియానే' - సుప్రీంకోర్టు మీడియా రెగ్యులేషన్
మీడియా నియంత్రణకు సంబంధించి సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ను దాఖలు చేసింది కేంద్రం. ఒకవేళ మీడియాను నియంత్రించాలనుకుంటే.. తొలుత డిజిటల్ మీడియాపై చర్యలు చేపట్టాలని పేర్కొంది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కోసం ఇప్పటికే సరిపడా నిబంధనలు ఉన్నాయని గుర్తుచేసింది.
మీడియా నియంత్రణపై సుప్రీంలో కేంద్రం కీలక వ్యాఖ్యలు
ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా నియంత్రణకు ఇప్పటికే సరిపడా నిబంధనలు ఉన్నాయని అత్యున్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్లో సమాచారశాఖ స్పష్టం చేసింది. 'సివిల్ సర్వీసు ఉద్యోగాల్లోకి ఓ వర్గం వారినే అధికంగా తీసుకునేందుకు కుట్ర జరిగింది' అని సుదర్శన్ టీవీ ఛానల్ ప్రోమోలు ప్రసారం చేయడానికి వ్యతిరేకంగా దాఖలైన పటిషన్లపై ఈమేరకు అభిప్రాయం చెప్పింది కేంద్రం.
ఇదీ చూడండి:-ప్రజాప్రతినిధులపై కేసుల విచారణకు జిల్లాకో ప్రత్యేక కోర్టు!